జర్నలిస్టులకు నితవసర వస్తువులు పంపిణీ
- మధురవాడ :
హజరత్ ముఖ్తియార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ మధురవాడ వారి ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో జర్నలిస్టులకు, న్యూస్ రీడర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అహ్మద్ ఫక్రుద్దీన్ పాల్గొని వారికి అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జర్నలిస్టులు చేస్తున్న సేవలు మారువలేనివని, కరోనా లాంటి కస్ట కాలంలో కూడా వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. ఈ విదంగానే ప్రజలకు సేవలందించాలని కోరారు.
ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత, పరిశిరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు .ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరులు, అక్షరభాను ఎడిటర్ పిల్లా విజయ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు బాషా మొహిద్దీన్, మెహతాబ్ అహ్మద్, జలాల్ బాషా (హీరు), సుధీర్, గాలిబ్ (జహంగీర్),సంతోష్, ప్రసాద్, తాజ్, వినయ్, వెంకీ, యాసీన్, రిషి, రాము, మస్తాన్, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.
హజరత్ ముఖ్తియార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ మధురవాడ వారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నితవసర వస్తువులు పంపిణీ