అమరావతి
24.4.2020
నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు
*- 67,874 రైతు ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ సొమ్ము*
*- రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు సాయం*
*- 67,874 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 54.52 కోట్ల పంట నష్టపరిహారం చెల్లింపు.*
*- ఆదేశాలు జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్*
*- పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదు జమ*
*- ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిన నగదు డిపాజిట్*
*- గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో లబ్దిపొందిన రైతుల జాబితాల ప్రదర్శన*