వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం

*వెల్లివిరిసిన వనిపెంట సుబ్బారెడ్డి దాతృత్వం  వింజమూరు, ఏప్రిల్ 9 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) : వింజమూరులోని నడిమూరు ప్రాంతానికి చెందిన వి.యస్.ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత వనిపెంట.సుబ్బారెడ్డి స్థానిక ప్రజలకు 10 రకాల నిత్యావసర సరుకులను గురువారం నాడు పంపిణీ చేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి ముఖ్య అతిధులుగా విచ్చేసిన తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించి ఉన్నందున పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు జీవన స్థితిగతులు భారంగా మారాయన్నారు. వీటిని గమనించిన దాతలు తమ వంతు సహాయం అందించడం గొప్ప విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ అనేది అత్యంత ప్రమాదకరమైందని, కేవలం ముందు జాగ్రత్త చర్యలతోనే నివారణ దిశగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వింజమూరు మండలంలో పేద వర్గాలను ఆదుకునేందుకు దాతలు విరివిగా ముందుకు రావడం ప్రశంసనీయమంటూ దాతలకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న దాతల సేవాగుణం మరువరానిదన్నారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీ సమయాలలోప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా సమదూరం పాటించే విధంగా దాతలు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. అనంతరం సుబ్బారెడ్డి అధ్వర్యంలో ఇంటింటికీ పలువురు యువకులు తిరుగుతూ ఫల సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమాలలో పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి, బి.జె.పి జిల్లా ఉపాధ్యక్షులు యల్లాల.రఘురామిరెడ్డి, పి.సి.సి సభ్యులు మద్దూరు.రాజగోపాల్ రెడ్డి, టి.డి.పి బి.సి విభాగం నేత నీలం.పెరుమాళ్ళు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image