కరోనా కట్టడికి విరాళాల ఇవ్వండి.

కరోనా కట్టడికి విరాళాల ఇవ్వండి.


- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ పిలుపు


మానవాళి విపత్తు కరోనా విజృంభిస్తున్న వేళ.. కరోనాను ఆరికట్టేందుకు ఆపన్న హస్తం చాచుదామని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం సిద్ధిపేట జిల్లాలోని మర్కుక్ మండలం వరదరాజ్ పూర్, గజ్వేల్ మండలం సింగాటం గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు స్వీకరించారు. 


- మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన హన్మకొండ చంద్రారెడ్డి గురువారం ఉదయం వరదరాజ్ పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5లక్షల రూపాయల చెక్కును మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. 


- గజ్వేల్ నియోజకవర్గ ఏల్ఐసీ ఏజెంట్స్, సిబ్బంది ఆధ్వర్యంలో రూ.51వేల రూపాయల డీడీని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని గురువారం ఉదయం సింగాటం గ్రామంలో మంత్రి హరీశ్ రావుకు అందజేశారు.