నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ .    

నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ .    


        నెల్లూరు: నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్  సెంటర్ పరిధి నందు నిరాశ్రయులై వీధుల్లో  రోడ్ల వెంబడి ఉన్న అనాధలయిన నిరుపేదలకు  నిత్య వాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గురువారం ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  నిత్య వాణి ఫౌండేషన్ కార్యదర్శి బొప్పూరు విజయ మోహన్ రావు మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కారణంగా నిరాశ్రయులై తిండి లేని అనాధలయిన నిరుపేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగిందని దాతలు నిప్పట్లపల్లి సుజికర్ సహకారంతో  ఈరోజు  ఆహారం  పంపిణీ చేయడం జరిగింది అన్నారు. మా సంస్థ దాతల సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో నిత్య వాణి ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఆనంద్,శిరీష్ ,భువనేశ్ తదితరులు పాల్గొన్నారు