ఇంట్లోనే ఉందాం ..ఆరోగ్యంగా ఉందాం :సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి

*05-04-2020*


*ఇంట్లోనే ఉందాం ..ఆరోగ్యంగా ఉందాం**సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి*డోన్ పట్టణం   అదివారం   డోన్ మున్సిపల్ కమీషనర్  కె యల్ యన్ రెడ్డి సార్,ఆరోగ్య విస్తరణ అధికారి కె. కృష్ణమోహన్ గార్లు  విడుదల చేసిన కరోనా వైరస్ (కోవిడ్ 19) కరపత్రాలను ప్రజలకు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప  బయటకు రావొద్దండి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి పూర్తి స్థాయి లో తోడ్పాటును అందిద్దాం. అందరి అరోగ్యాలను కాపాడుదాం. అలాగే మనవంతు  ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నిద్దామని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.


‘మీతో మేం ఉన్నాం.. మీరు ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి’’ అని వైద్యులు, పోలీసుల విజ్ఞప్తిని గౌరవిద్దామని రఫి తెలిపారు