అలుపెరగని ' జగన్ ' బృందం అన్నదానం

అలుపెరగని ' జగన్ ' బృందం అన్నదానం


వింజమూరు, ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో పోరెడ్డి.జగన్ రెడ్డి బృందం చేస్తున్న అన్నదానం ఆకలి దప్పులతో అలమటిస్తున్న వారికి దేవుడిచ్చిన వరంలా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో నియంత్రణా చర్యలలో భాగంగా ప్రభుత్వాలు నిబంధనలు కఠిమతరం చేసిన విషయం విదితమే. అయితే నిత్యం కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వారు కొంతమేర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి ప్రతిరోజూ మానవతా దృక్పధంతో భోజనాలు అందిస్తున్నామని పోరెడ్డి.జగన్ రెడ్డి వెల్లడించారు. అంతేగాక ప్రజల సం రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న పలు శాఖల సిబ్బందికి కూడా భోజనాలు సమకూర్చుతున్నామన్నారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి లు ఆకలితో అలమటిస్తున్న వారికి ఆపన్నహస్తం అందించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. లాక్ డౌన్ ముగిసేవరకూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో బృందం సభ్యులు గూడా.చంద్రారెడ్డి, మెట్టుపల్లి.వెంకారెడ్డిలు పాల్గొన్నారు.