ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం

11–04–2020
అమరావతి
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం 


అమరావతి: కరోనా వైరస్‌ నివారణా చర్యలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోంమంత్రి మేకతోటి  సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు.


– లాక్‌డౌన్‌పై ప్రధానితో తన అభిప్రాయాలను పంచుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌
– రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం: సీఎం
– అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నాం: సీఎం –రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న  కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం: సీఎం
– కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి,  వారికి వైద్యం అందిస్తున్నాం:
– ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు:
– కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారు:
– అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోంది:
– లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించాం:
– ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం:
– క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటుచేసుకున్నాం:
– 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం:
– జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటుచేసుకుంటున్నాం:
– సమర్థవంతంగా క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌సెంటర్లను ఏర్పాటుచేసుకున్నాం, ఇందులో 26వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి:


– సామాన్యులపై, రాష్ట్రంపై లాక్‌డౌన్‌ ప్రభావానికి సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను: సీఎం
– మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక:
– జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాథికల్పనలో 62శాతం వాటా వ్యవసాయానిదే:
లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది:
– నిలిపివేస్తారనే భయంతో 25శాతం మించి ట్రక్కులు తిరగడంలేదు :
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వచేయడానికి సరిపడా గోదాములు లేవు:
– మార్కెట్లు నడవకపోవడంతో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది:
కాని స్థానికంగా వీటిని ఎంతవరకు వినియోగించగలం?:
– ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి:
– నిల్వచేయడానికి తగిన స్టోరేజీ సదుపాయంలేక, ఎగుమతులు లేక ఆక్వా రంగంకూడా తీవ్రంగా దెబ్బతింటోంది:
– ఇక రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. . 1,03,986 యూనిట్లకుగానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయి:
– పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది:
– రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడంకూడా సంక్షోభం పెరగడానికి కారణమయ్యింది:
– పరిశ్రమలు నడవనప్పుడు... వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలం?:
– రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి:
– సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత పరిస్థితి తలెత్తింది:
– లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు:
– కోవిడ్‌ని–19 నివారణకు ప్రధాని మంత్రిగా మీరు తీసుకున్న విశాలపరమైన, గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నాను:
– అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్నది నా అభిప్రాయం:
– ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలన్నది నా అభిప్రాయం:
– 1918లో వచ్చిన ఫ్లూ కూడా భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది:
– రెండేళ్లకుపైగా అది దేశంపై ప్రభావం చూపింది:
– మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటే... దీర్ఘకాలంలో మనం పోరాటంచేయాల్సి ఉంటుంది:
– ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న వివరాలను, సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్ని దాన్ని విశ్లేషించి కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను:
– 676 మండలాలు మా రాష్ట్రంలో ఉన్నాయి:
కరోనా వైరస్‌ సోకిన మండలాల్లో 37 రెడ్‌జోన్‌లో ఉన్నాయి, ఆరెంజ్‌ జోన్లో 44 మండలాలు ఉన్నాయి:
– 676 మండలాల్లో 81 మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి:
595 మండలాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయి, ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు:
– రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేయాలన్నది నా అభిప్రాయం:
– జనం గుమిగూడకుండా మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనామందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలన్నది నా అభిప్రాయం:
– ఇవికాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలన్నది నా అభిప్రాయం:
– కరోనా వైరస్‌ మరింత వ్యాపించకుండా దేవుడి దయవల్ల అడ్డుకోగలుగుతున్నాం:
– మన కంటికి కనిపించని ఈ మహమ్మారి త్వరలోనే నయం అవుతుందని నమ్ముతున్నాం:
– నా అభిప్రాయంతో పాటు, మా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై మీకు సంక్షిప్తంగా నివేదించాను:
– ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా ఉండాలి, ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలి:
– మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది:
– ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకుసాగుతాం:


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image