అంతిమతీర్పు కధనానికి కదిలిన ట్రాన్స్ కో అధికారులు

అంతిమతీర్పు కధనానికి కదిలిన ట్రాన్స్ కో అధికారులు


వింజమూరు, ఏప్రిల్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెం వద్ద నున్న విద్యుత్ స్థంభానికి నిలువెత్తున అల్లుకుపోయిన తీగెల చెట్లును ఎట్టకేలకు ట్రాన్స్ కో అధికారులు తొలగించారు. ' అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం ' అనే శీర్షికన బుధవారం నాడు అంతిమతీర్పు దినపత్రికలో న్యూస్ కధనం ప్రచురితమైన విషయం అందరికీ విదితమే. వార్త ప్రచురితమైన 24 గంటలు గడవక మునుపే విద్యుత్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించి విద్యుత్ స్థంభానికి అల్లుకుపోయిన తీగెల చెట్లును తీసివేశారు. ఈ ప్రాంతంలో దాదాపుగా యేడాది నుండి విద్యుత్ స్థంబానికి క్రింది భాగం నుండి పై భాగం మెయిన్ లైన్లు వరకు చెట్లు ఎగబాకాయి. నిత్యం ఈ విద్యుత్ స్థంభం పరిసరాలలో ప్రజలుతో పాటు మూగజీవాలు కూడా తిరుగుతుంటాయి. పచ్చటి తీగెలు కావడంతో మెయిన్ లైన్లు నుండి ఎప్పుడు విద్యుత్ ప్రసారమై ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఈ ప్రాంత వాసులు నిత్యం ఆందోళనకు గురవుతుండేవారు. స్థానిక ప్రజలు ఈ విషయమును అంతిమతీర్పు ప్రతినిధికి తెలియపరచడంతో న్యూస్ రూపంలో ప్రచురించడం జరిగింది. దీనికి తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ట్రాన్స్ కో లైన్ మెన్ నవాజ్ అధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్మికులు గురువారం ఉదయం యర్రబల్లిపాళెంలోని విద్యుత్ స్థంభం వద్దకు చేరుకుని ముళ్ళ తీగెలను తొలగించి, పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఈ విషయమును అంతిమతీర్పు ప్రతినిధికి చరవాణి ద్వారా తెలియపరచడంతో పాటు విద్యుత్ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.