మీడియా సేవలు ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఆదుకోవాలి :ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్  ( పెన్ )

 


 విజయవాడ :24-04-2020



మీడియా సేవలు అత్యవసరమని భావించిన ప్రభుత్వాలు ఆ  సేవలు అందిస్తున్నజ ర్నలిస్ట్స్ ను పట్టించుకోవడం లేదని  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్  ( పెన్ ) ఆరోపించింది. ఈ మేరకు పెన్  రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ స్పందించి  అసంతృప్తి వ్యక్తం చేశారు .  సమాజ వికాసానికి అహర్నిశలు శ్రమిస్తున్న  జర్నలిస్ట్స్ జీవితాలు మసకబారుతున్నాయన్నారు. జర్నలిస్టులు    కరోనా కష్టాల్లో  కొట్టు  మిట్టాడుతూ   పస్తులుంటున్నారన్నారు.  మీడియా సేవలు అత్యవసరమని భావించిన ప్రభుత్వాలు  ఆ సేవలు అందిస్తున్న  జర్నలిస్టులను కష్టకాలంలో   


పట్టించుకోకపోవడం దృరదృష్టకరమని  అన్నారు .    
కరోనా వైరస్ పై చేస్తున్న  యుద్ధంలో  పంచాంగాలు  పని  ఇచ్చేస్తున్నా  అందులో  ఒక ముఖ్య భాగమైన   మీడియాని  విస్మరించడం దారుణమన్నారు.  పంచ అంగాలైన  డాక్టర్స్, రెవెన్యూ, పోలీస్, పారిశుద్ధ్య  కార్మికులు, జర్నలిస్ట్స్, ఐతే ఆ నలుగురికీ రక్షణ ఉంది. జర్నలిస్ట్స్ కు రక్షణ లేదన్నారు. 50 లక్షల కరోనా భీమా వర్తింప చేయలేదన్నారు. సురక్షా పరికరాలు లేవన్నారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలకు ఎందుకు వివక్ష  అనేది  పాత్రికేయుల్లో సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న అన్నారు.  
 కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రసారమద్యామాలది    కీలక పాత్ర అన్నారు.  
ప్రాణాలు పణంగా పెట్టి జర్నలిస్ట్స్ సేవలందిస్తూ  ప్రజలను చైతన్య పరుస్తున్నారన్నారు. 
పొరుగు రాష్ట్రాల్లో  ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా  రక్షణ కొరవడి కొవైడ్ 19 వైరస్ సోకి జర్నలిస్ట్స్  విలవిలలాడుతున్నాని, వారికుటుంబబాలు  అల్లాడుతున్నాయన్నారు . ప్రభుత్వాలు ఈ పరిస్థితులు గ్రహించైనా   తక్షణం స్పందించి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ముందుకు రావాలని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్  కారణంగా  జర్నలిస్ట్స్ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఆర్దికంగా ప్రభుత్వాలు ఆదుకోవాలని  గత నెలరోజులుగా  జర్నలిస్ట్స్, జర్నలిస్ట్ సంఘాలు గొంతెత్తి గోషిస్తున్నా ప్రభుత్వాలు  పెడచెవిని పెట్టడం పట్ల  ఆవేదన వ్యక్తం చేశారు.  కొంత మేరకు మనసున్న ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చి సహకరించినా  పూర్తి గా న్యాయం జరగదన్నారు. అందుకు కొందరు ముందుకు రారు అన్నారు. ప్రభుత్వాలే   స్పందించి      తక్షణ సహాయంగా    
   ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 10 వేల ఆర్థిక సహకారం అందించాలి, 50 లక్షల కరోనా భీమా  ప్రకటించాలని, సురక్ష పరికరాలు అందించాలని  ప్రింట్ అండ్  ఎలక్ట్రానిక్ న్యూస్  జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ( పెన్  ) ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది . అదేవిధంగా  కరోనా కారణం గా  ఆర్ధికఇబ్బందులెదుర్కొంటున్న  పరిస్థితుల్లో వున్న ఇతర రంగాలకు ప్రకటించిన ప్రధాన మంత్రి  ఉద్దీపన పధకాన్ని మీడియా రంగానికి వర్తింప చేయాలని ప్రభాకర్ కోరారు.