విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపుతో దాతల ముందడుగు


 
 :  రూ .5 లక్షల చెక్ లను ఎంపీ సమక్షంలో సీపీ కు అందజేస్తున్న ప్రతినిధులు
 
 
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపుతో దాతల ముందడుగు
సమకూరిన రూ.5 లక్షలు నగదుని చెక్ రూపంలో విశాఖ నగర సీపీ(కమిషనర్ ఆఫ్ పోలీసు ) ఆర్.కే మీనాకు అందజేత
విశాఖపట్నం, ఏప్రిల్ 4
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కరోన నియంత్రణకు పలువిధాలుగా తోడ్పాటు నందిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో కరోన కట్టడికి తనవంతు సహాయంగా  రూ. 25 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా మరో  రూ.20 లక్షలు దాతలచేత ఇప్పించగా,ప్రస్త్తుతం 
ఓ అడుగు ముందుకు వేసి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోన నియంత్రణలో భాగంగా డాక్టర్లు, పారిశుధ్య కార్మికుల సేవలను పొగిడిన ఆయన , తాజాగా పోలీసులకు తోడ్పాటునందించారు. రాత్రనకా, పగలనకా పహారా కాస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడి, అటు కేంద్రం ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఆదేశాలను తూ.చా తప్పకుండా విధులు నిర్వహిస్తున్న రక్షక భటుల కై నడుంబిగించారు. తన పార్లమెంట్ పరిధితో పాటు పలువురిని ఈ విషయంపై జాగృతాపరుస్తూ పోలీసులకు నిధులు సమకూర్చారు.సంధ్య ఆక్వా రూ.1 లక్ష, నెక్కంటి రూ.1 లక్ష ,సంధ్య మెరిన్స్ రూ.50 వేలు,తనిష్క్ షోరూం రూ.50 వేలు,మద్దినేని సురేష్ రూ.50 వేలు,సూర్య బిర్యానీస్ రూ.50 వేలు,కొమ్మి కిరణ్ కుమార్ రూ.50 వేలు ,ఎన్.సాయిభాస్కర్ రూ.50 వేలు 
 చొప్పున మొత్తం రూ.5  లక్షల రూపాయలను చెక్ రూపంలో  విశాఖ ఎంపీ సమక్షంలో విశాఖ నగర కమిషనర్ ఆర్.కే.మీనా కు, ఆయన కార్యాలయం లో అందజేశారు. ఈ మొత్తాన్ని పోలీసు అవసరాలకు వెచ్చించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ పోలీసు లు విధినిర్వహణలో చూపుతున్న చొరవను అభినందించారు. వారికి వెన్నుదన్నుగా నిలిచి , ఇతోధికంగా తోడ్పాటు నివ్వాలని పిలుపునిచ్చారు. నగర పరిధిలో సీపీ మీనా చేపడుతున్న కరోన నియంత్రణ చర్యలను అభినందించారు.