జగన్ మామయ్య అని పిలుస్తారు అన్నా...జగన్ తో ఓ తల్లి

విజయవాడ, ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు) :



మంగళవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మాట్లాడిన  విద్యార్థిని అపర్ణ తల్లి రత్న కుమారి.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.కరోన సంక్షోభంలో కూడా మీరు 1000 రూపాయలు  ఆర్థిక సహాయం ఇచ్చారు.వాలంటీర్లు ఇంటింటికి వచ్చి బియ్యం, పప్పు ఇచ్చారు. మేం చాలా హ్యాపీగా, సంక్షోభంలో కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు


 మా చదివించలేక ఏడ్వాని రోజు లేదు. తనకు ముగ్గురు పిల్లలు. జగనన్న ముఖ్యమంత్రి గా వచ్చిన తరువాత జగనన్న వసతి దీవెన కింద రూ. 10 వేలు,అమ్మవోడి కింద రూ. 15 వేలు ,ఇప్పుడు మరో జగనన్న వసతి దీవెన ద్వారా  రూ.10 వేలు ఇచ్చారు.మొత్తం 35,000 నా కుటుంబానికి వచ్చాయి.ముఖ్యమంత్రి జగనన్నకి కృతజ్ఞత లు తెలియచేసు కుంటున్నాము...మా ఇంట్లో పిల్లలు నిన్ను జగన్ మామయ్య అని పిలుస్తారు అన్నా ..