ఓపెన్ ప్లేసుల్లో పొగాకు వాడకం బ్యాన్ చేయండి : కేంద్ర ప్రభుత్వం

ఓపెన్ ప్లేసుల్లో పొగాకు వాడకం బ్యాన్ చేయండి.......


*అన్ని రాష్ట్రాలకు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశం.


న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడటం, ఉమ్మివేయడాన్ని నిషేధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు శనివారం అన్ని రాష్ట్రాల సీఎస్​లకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. తంబాకు, పాన్ మసాలా, సుపారి, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులను నమలడంతో లాలాజలం ఎక్కువగా వచ్చి తప్పకుండా ఉమ్మివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దాంతో కరోనా వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది లేఖలో పేర్కొంది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్ట్, ఐపీసీ 1860, సీఆర్ పీసీ లోని వివిధ రూల్స్ ప్రకారం రాష్ట్రాలు, యూటీలు ఈమేరకు ఆదేశాలు జారీ చేయవచ్చునని గుర్తుచేసింది. పొగాకు ఉత్పత్తులను వాడటం, ఉమ్మివేయడాన్ని నిషేధించేందుకు ఆయా చట్టాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కోరింది.


*పొగాకు తినడం ఆపి వేయండి.


కరోనా మహమ్మారితో పెరుగుతున్న ప్రమాద స్థాయిని దృష్టిలో ఉంచుకుని పొగాకు ఉత్పత్తులను తినడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా ఎఫెక్టుతో తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాలు పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ఇప్పటికే నిషేధించాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు