రాజధాని విశాఖకు మార్చడం కోసం కేసుల వివరాలు బయటపెట్టడం లేదు : మాజీ మంత్రి దేవినేని

విజయవాడ ,ఏప్రిల్ ,22 (అంతిమ తీర్పు):


కరోనా పేరుతో ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ సేవలు నిలిపివేయడం దారుణం
జీతాలివ్వడానికి డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం సలహాదారులకు, కాంట్రాక్టర్లకు కోట్లు ఎలా చెల్లించింది
రాజధాని విశాఖకు మార్చడం కోసం కేసుల వివరాలు బయటపెట్టడం లేదు
- మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు


రాష్ట్రంలో 24 గంటల్లో 56 కేసులు నమోదయ్యాయి. 41812 టెస్టులు చేశాం, దేశంలో మొదటి స్థానంలో ఉన్నామంటున్నారు. ఎక్కడ చేశారు.? ఏ జిల్లాలో ఎన్ని టెస్టులు చేశారో వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు.? అన్నింటిలో కాసులు దండుకున్న ప్రభుత్వ పెద్దలు ఆఖరుకి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తెచ్చిన ర్యాపిడ్ కిట్లలోనూ కక్కుర్తిపడిన తీరు దేశమంతా చూపింది. మీరు తెచ్చిన కిట్ల పనితీరుపై ఐసీఎంఆర్, కేంద్ర మంత్రి అనుమానాలు వ్యక్తం చేశారు. 
కరోనా పేరుతో రాష్ట్రంలోని ఆస్పత్రులన్నీ మూసివేశారు. పరీక్షలు చేసే పరిస్థితి లేకుండా పోతోంది. ఫలితంగా నిన్న అనంతపురంలో 13 ఏళ్ల బాలిక వైద్యం అందక అనారోగ్యంతో చనిపోయింది. ఈ రోజు కొండపల్లిలో ఒక మహిళ గుండె నొప్పితో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్తే.. గంట నుంచోబెట్టి గుంటూరు వెళ్లమన్నారు. ఆస్పత్రి సిబ్బంది ఏం చేస్తున్నారు.? కోట్ల వేతనాలు తీసుకుంటున్న మేధావులు, సలహాదారులు ఏం సలహాలిస్తున్నారు? గర్భిణీలకు కూడా సరైన వైద్యం అందే పరిస్థితి లేకుండా పోతోంది. అసలు రాష్ట్రంలో ఎంత మంది గర్భిణీలున్నారు. వారికి డెలివరీ డేట్లు ఎప్పుడిచ్చారు. వారు ఎక్కడ పరీక్షలు చేయించుకుంటున్నారో కనీసం లెక్కలున్నాయా.?


నిత్యావసరాలు కొనుగోలు చేసే ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు ఎవరు పరిశీలిస్తున్నారు.? గుంపులు గుంపులుగా ప్రజలు వస్తుంటే ఎవరు పర్యవేక్షిస్తున్నారు.? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విస్తరణ మూడో దశకు చేరుకుంది. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేస్తే.. కరోనాను నిలువరించడంలో విఫలమైన జగన్ తన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు.
ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. 


స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుకోవడంపై ఆరాటంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ముఖ్యమంత్రి నిర్వీర్యం చేశారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు తీర్పును కూడా తుంగలో తొక్కుతూ.. వాలంటీర్లతో విద్యార్ధుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఇంగ్లీష్ మీడియం విషయంలో ఒప్పించాలన ఒత్తిడి తెస్తున్నారు. వెన్నెముక లేని అధికారులు జీవోలు సిద్ధం చేస్తున్నారు. ఇదేం పద్దతి.? రంగులు తొలగించాలని హై కోర్టు, సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వ భవనాలకు రంగులేస్తున్నారు.


ఉద్యోగుల జీతాల్లో, పెన్షన్ దారుల పెన్షన్ లో 50 శాతం కట్ చేసిన ప్రభుత్వం.. లక్షల్లో జీతాలు తీసుకునే సలహాదారుల కోసం రూ.1.03 కోట్లు విడుదల చేశారు. మార్చి 20 నాటికే జీతాలివ్వాల్సిందిగా జీవో ఇచ్చి నిధులు విడుదల చేయించారు. కమిషన్లు దండుకోవడం కోసం కాంట్రాక్టర్లకు రూ.6400 కోట్లు చెల్లించారు. కానీ ప్రాణాలు చేతిలో పెట్టుకుని పని చేస్తున్న పోలీసులు, రెవెన్యూ, పారిశుధ్య కార్మికులకు జీతాలు కట్ చేస్తారా.?


విశాఖలో 21 కేసులే అని ప్రబుత్వం చెబుతోంది. కానీ చెస్ట్ ఆస్పత్రిలో 34 మంది, ప్రథమ అనే ప్రైవేట్ ఆస్పత్రిలో 17 మందికి ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు. వారంతా పాజిటివ్ కాదు నెగిటివ్ అని అక్కడి మంత్రులు గానీ, విజయసాయి రెడ్డిగానీ చెప్పే ధైర్యం ఉందా.? మరోవైపు ఎవరేం చేసినా.. ఎన్ని జరిగినా రాజధాని విశాఖకు వెళ్తుందని విజయసాయి రెడ్డి చెబుతున్నాడు. విశాఖలో ఉన్న కేసుల గురించి ఎందుకు ఇన్ని అబద్దాలు చెబుతున్నారు. ప్రభుత్వం ఎందుకు వాస్తవాలు బయటపెట్టడం లేదు. విశాఖకు రాజధాని తరలించాలన్న ఒకే ఒక్క తలంపుతో అక్కడి కేసుల్ని దాచిపెట్టడం దుర్మార్గం. 
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి చేయకుండా స్వేచ్ఛగా పని చేయనిస్తే.. గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఇంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొనేవా.? నెల్లూరు జిల్లాకు చెందిన ఓ డాక్టర్ చెన్నైలో చనిపోయాడు. దానికి బుల్లెట్ మంత్రి ఏం సమాధానం చెబుతాడు.? ఐదు రోజుల్లో మాకు నరకం చూపిస్తానని బుల్లెట్ మంత్రి అంటున్నాడు. కానీ.. తమ అసమర్ధత, చేతకానితనం, అహంకార పూరిత మనస్తత్వంతో ఐదు కోట్ల మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికేలా చేశారు.
ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి ప్రజలకు భరోసా కల్పించాలన్న ఆలోచన లేకుండా తాడేపల్లిలో నిద్రపోతున్నాడు. రెడ్ జోన్ లో ఉన్న ప్రాంతాల్లోని ఉద్యోగులు కూడా విధులకు హాజరవ్వాల్సిందేనని నోటీసులివ్వడం ఎంత వరకు సబబు.?
రాష్ట్రంలో రైతుల పంటలు కొనేందుకు లారీలు లేవు కానీ వైకాపా నాయకులు అక్రమంగా మట్టి ఇసుక తరలించడనికి మాత్రం లారీలు దొరుకుతున్నాయి. జగ్గయపేటలో ఏ ప్రాంతంలో చూసిన ఇసుక అక్రమ రవాణా దర్శనమిస్తోంది. 
ప్రభుత్వం కొన్నట్లు ఆన్ లైన్లో చూపించిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.270 కోట్లు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటిలోగా చెల్లిస్తుందో సమాధానం చెప్పాలి. తెలుగుదేశం హయాంలో 5 రోజులలో ధాన్యం డబ్బులు చెల్లించడం జరిగేది. రైతుల నుంచి కొన్న పంట వివరాలను తెలపాలని ప్రకాశం జిల్లా రైతు వేసిన పిటిషన్కు 460 మెట్రిక్ టన్నుల టమాటా, 6,500 మెట్రిక్ టన్నుల అరటి గెలలు మాత్రమె కొన్నట్లు హైకోర్టుకు నివేదించారు. అందులోను పులివెందులలోని అరటి గెలలు బాగోకపోయినా కూడా డ్వాక్రా మహిళల చేత బలవంతంగా అమ్మకాలు జరిపిస్తు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైంది. ధాన్యానికి వైరస్ వచ్చిందని అర్థంపర్థం లేని సాకులతో దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం రోడ్డుపై ఉంటే ముఖ్యమంత్రి, బూతు శాఖ మంత్రి ఎం చేస్తున్నారు. పులివెందులలో చీనీ రైతు చనిపోతే కనీసం ముఖ్యమంత్రి ఒక్క స్టేట్ మెంట్ ఇవ్వలేదు. శ్రీశైలం డ్యాం ఎందుకు ఖాళీ చేశారో ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గర సమాధానం లేదు. పంట కొనుగోళ్లపై తాడేపల్లి రాజప్రాసాదం నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రైతాంగానికి సమాధానం చెప్పాలి.


Popular posts
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..
Image
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*