ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజనాలు పంపిణీ

ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజనాలు పంపిణీ


వింజమూరు, ఏప్రిల్ 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ నియంత్రణ కోసం నిరంతరం శ్రమిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు బుధవారం నాడు స్థానిక బి.సి కాలనీకి చెందిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేత భోజనపు.గోపి భోజనాల ప్యాకెట్లును అందజేశారు. ఇందులో భాగంగా వాలంటీర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, రెవిన్యూ శాఖ సిబ్బంది, యం.పి.డి.ఓ కార్యాలయం సిబ్బందికి భోజనాలు పంపిణీ చేస్తూ వారి వారి సేవలను కొనియాడారు. కరోనా వైరస్ నియంత్రణకు అహర్నిశలూ శ్రమిస్తూ ఉన్న ఈ శాఖల ఉద్యోగులు, సిబ్బందికీ ప్రజలందరూ రుణపడి ఉంటారన్నారు. వింజమూరు మండలమును గ్రీన్ జోన్ పరిధిలోకి తెచ్చేందుకు పాటుపడిన తహసిల్ధారు సుధాకర్ రావు, ఎస్.ఐ బాజిరెడ్డి, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, వైధ్యాధికారి హరిక్రిష్ణలు నిత్య కృషీవలురని గోపి కొనియాడారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డిల ఆశయాలకు అనుగుణంగా ఈ కరోనా కాలంలో ప్రజలకు తమ వంతు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. స్థానిక తహసిల్ధారు కార్యాలయంలో డిప్యూటీ తహసిల్ధారు మురళీధర్ రాజు చేతుల మీదుగా భోజనాల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భోజనపు.దివ్యశ్రీ, భోజనపు.అర్జున్, రమేష్, ఆనంద్, చంద్ర, నవీన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.