నేడే వైయస్సార్‌ మత్స్యకార భరోసా పధకం చెల్లింపులు

*05.05.2020*
*అమరావతి*


*నేడే ) వైయస్సార్‌ మత్స్యకార భరోసా పధకం చెల్లింపులు*
*చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఆర్థిక సహాయం*
*సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వ భరోసా*
*దేశమంతా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ వీడని ప్రభుత్వ సంకల్పం*
*లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సహాయం*
*గత ఏడాది నవంబరులో మత్స్యకార దినోత్సవం నాడు ఆర్థిక సహాయం*
*ఈ ఏడాది ఎన్ని కష్టాలున్నా మే నెలలోనే మత్స్యకారభరోసా పథకం అమలు*
*‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని తన సుదీర్ఘ పాదయాత్రలో హామీ*
*ఆ మాటలు నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌*


అమరావతి:


అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఆ దిశలో మరో ముందడుగు వేసింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకుఇచ్చే పరిహారాన్ని రూ.10 వేలకు పెంచడంతో పాటు, గత ఏడాది మత్స్యకార దినోత్సవం రోజు ఆ మొత్తం చెల్లించగా, ఈసారి మే నెలలోనే వారికి ఆర్థిక సహాయం చేస్తోంది. లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు బుధవారం నాడు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఈ సహాయం చేయడం ఒక విశేషం కాగా, దేశమంతా లాక్‌డౌన్‌ పరిస్థితి నేపథ్యంలో, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నా, సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటూ, వారికి ఆర్థికంగా భరోసా ఇస్తూ, వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలోనే అమలు చేస్తోంది. 
 
*ఎవరెవరికి?*
 సముద్రంలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధ సమయంలో గతంలో మత్స్యకార కుటుంబాలకు 2018 వరకు రూ.4 వేల చొప్పున సహాయం చేయగా, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. అంతే కాకుండా 2018 వరకు వరకు మర పడవల్లో చేపల వేటకు వెళ్లే వారికి మాత్రమే ఆ సహాయం అందగా, 2019 నుంచి దేశీయ నాటు, తెడ్డు, తెరచాప సహాయంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా రూ.10 వేలు చెల్లిస్తున్నారు. గత ఏడాది నవంబరు 21న మత్స్యకార దినోత్సవం రోజున ఆ సహాయం అందించగా, ఈసారి 6 నెలల ముందుగానే,  బుధవారం మత్స్యకారుల బ్యాంక్‌ ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.10 వేల చొప్పున జమ చేస్తున్నారు. 


*ఇంకా ఏమేం చేశారు?*
*డీజిల్‌పై సబ్సిడీ పెంపు. తక్షణమే చెల్లింపు:*


 మత్స్యకారులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. చేపల వేట కోసం మత్స్యకారులు వినియోగించే పడవలకు 2019 వరకు లీటరు డీజిల్‌పై రూ.6.03 గా ఉన్న సబ్సిడీని రూ.9 కి పెంచడంతో పాటు, ఆ రాయితీ తక్షణమే అందిస్తున్నారు. డీజిల్‌ కొనుగోలు చేసిన వెంటనే స్మార్ట్‌కార్డుల ద్వారా ఆ రాయితీని బంకు యజమానులకు చెల్లించేలా ఏర్పాటు చేశారు.మత్స్యశాఖకుచెందిన 6 డీజిల్‌ బంకులతో పాటు, ప్రభుత్వం గుర్తించిన 68
 ప్రైవేటు బంకుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మెకనైజ్డ్‌ బోట్లకు నెలకు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్‌ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుండగా, చేపల వేటపై నిషేధం సమయంలో మినహా ఏటా మొత్తం 10 నెలల పాటు పథకం వర్తింప చేస్తున్నారు. 


*రూ.10 లక్షల పరిహారం*


 సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలకు ఇచ్చే పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. 


*పాకిస్తాన్‌ చెర నుంచి*


 సముద్రంలో తమ జలాల్లోకి ప్రవేశించారంటూ రాష్ట్రానికి చెందిన 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ భద్రతా బలగాలు 2018 నవంబరులో అరెస్టు చేశాయి. వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 15 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు 5గురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. వారిని విడిపించేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా ఆ మత్స్యకారులంతా పాక్‌ జైలు నుంచి సురక్షితంగా విడుదలయ్యారు. స్వయంగా వాఘా సరిహద్దుకు వెళ్లిన మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆ మత్స్యకారులకు స్వాగతం పలికి రాష్ట్రానికి తీసుకు వచ్చారు. వారందరిని వారి స్వస్థలాలకు పంపడంతో పాటు, ఒక్కొక్కరికి జీవన ఉపాధి కోసం రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించింది.


*కేంద్రం తరపున..*


 గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ 2012లో సముద్రంలో జరిపిన డ్రిల్లింగ్‌ వల్ల తూర్పు గోదావరి జిల్లాలో 8 మండలాల్లోని 68 గ్రామాలకు చెందిన 5060 పడవలు చేపలవేటకు వెళ్లలేకపోయాయి. దీంతో 16,559 మంది మత్స్యకారులు జీవనభృతి కోల్పోయారు. 13 నెలల పాటు ఆ డ్రిల్లింగ్‌ జరగగా, జీఎస్‌పీఎస్‌ సంస్థ వారికి 6 నెలలకు గానూ రూ.68.88 కోట్లు చెల్లించింది. మిగిలిన 7 నెలలకు సంబంధించి రూ.70.53 కోట్లు ఇవ్వలేదు. 
 అయితే ఆ సొమ్ము చెల్లిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, రూ.70.53 కోట్లు కేంద్రం నుంచి నిధులు రానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ఏడాది మత్స్యకార దినోత్సవం రోజున చెల్లించారు. 


*4300 మంది మత్స్యకారుల తరలింపు*
 గుజరాత్‌ తీరం వెంట సముద్రంలో చేపలవేటకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన 4300 మంది మత్స్యకారులు కరోనా తాకిడితో అక్కడే చిక్కుబడి పోగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, వారికి అక్కడ సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఖర్చుకు వెనకాడకుండా ప్రత్యేక రవాణా సదుపాయం ద్వారా అందరినీ సురక్షితంగా ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రానికి తీసుకువచ్చారు. 


*ఫిష్‌ ల్యాండింగ్, ఫిషింగ్‌ హార్బర్లు*
 కోస్తా జిల్లాలలో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలు మెరుగు పర్చడమే కాకుండా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో 3 కొత్త ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఉన్న నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్లను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
 శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో ఫిష్‌ లాండింగ్‌ సెంటర్‌ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంలో కేంద్రం వాటాకు సంబంధించి రూ.144.40 కోట్లకు గానూ మొదటి విడతగా రూ.18 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు  మత్స్యకారులకు అండగా నిల్చేందుకు 725 మంది గ్రామ మత్స్య సహాయకులను కూడా ప్రభుత్వం నియమించింది.


*ఇప్పుడు లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ..*
 ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోతోంది. ఒకవైపు ఆదాయం పూర్తిగా పడిపోగా, మరోవైపు కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ చేపల వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో, లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image