దారి దోపిడీ, బైక్ కాల్చివేత పై కేసు నమోదు

*దారి దోపిడీ, బైక్ కాల్చివేత పై కేసు నమోదు
వరికుంటపాడు ,మే 9 (అంతిమ తీర్పు) : వరికుంటపాడు మండలం విరువూరు సమీపంలో దారి దోపిడీ, మోటార్ సైకిల్ దహనం జరిగింది.పోలీసులు తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పామూరు కి చెందిన పబ్బతి వెంకటనారాయణ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి  నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పాపానగారిపల్లి కి వెళ్లి వ్యక్తిగత పనులు ముగించుకుని తిరిగి పామూరు కి వెళ్తుండగా విరువూరు శివారు ప్రాంతం లో అతని బుల్లెట్ వాహనాన్ని ఆపి పొదల్లోకి తీసుకెళ్లి కళ్ళలో కారం కొట్టి అతని వద్ద ఉన్న 4000 రూపాయలు, సెల్ ఫోన్ ని తీసుకుని పారిపోయారు. ఈ విషయం అయి బాధితుడు వరికుంటపాడు పోలీస్ లకు పిర్యాదు చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎసై ఉమా శంకర్ జరిగిన ఘటన పై కేసు నమోదు చేసి అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు.