మాస్కులు ధరించకుండా తిరిగితే కఠిన చర్యలు  :ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి

మాస్కులు ధరించకుండా తిరిగితే కఠిన చర్యలు 
.......ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి
( ఆత్మకూరు  అంతిమ తీర్పు ఇంచార్జ్ రహమత్ అలీ )
ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా బయట తిరిగే వ్యక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి మాత్రమే బయటికి రావాలని మాస్కులు లేకుండా కనిపిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆత్మకూర్ ఆర్డీవో బి.ఉమాదేవి తెలిపారు 
ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయం లో శుక్రవారం  మున్సిపల్, రెవెన్యూ, వైద్య, బ్యాంకు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సమావేశంలో  కోవిద్ కమిటీ సూచించిన విధంగా అధికారులు మాస్కుల విషయంలో కఠినమైన ఆదేశాలను అమలు పర్చాలని ఆర్డీవో సూచించారు    అవసరం లేకపోయినా కూడా  ప్రజలు ఏదో ఒక సాకు చూపిస్తూ బయట తిరుగుతున్నారని కొందరైతే బ్యాంకుకు  వెళ్తున్నాము అంటూ కూడా చెబుతున్నట్లు  తన  దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా ఆర్టీవో అన్నారు.. అందువల్ల బ్యాంకు సిబ్బందికి  కూడా సూచించేది ఏమనగా బ్యాంకులో  వచ్చేవారికి తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు సమదూరం పాటిస్తూ పదిమందికి మించి బ్యాంకు లోపల వ్యక్తులను ఉంచకూడదని సూచించారు.. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం టూ వీలర్ మోటార్ సైకిల్ పై ఒకరు మాత్రమే ప్రయాణించాలని అంతకు మించి ఎవరు ప్రయాణం చేసిన వారిపై కేసులు నమోదు చేయమని పోలీస్ శాఖకు సూచించారు... కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రజలు తమ పరిధిలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డిఓ  తెలిపారు.  అలాగే ప్రభుత్వం తరపున జరిగే పనులు ఎన్ఆర్జీఎస్, అగ్రికల్చర్, బ్రేక్లైన్స్, రోడ్డు పనులు,  ఏ పనైనా మాస్కులు ధరించి సమదూరం పాటించి పని చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖలు అధికారులు పాల్గొన్నారు...