విశాఖపట్నం ఆర్ ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజి దుర్ఘటన  బాధాకరం :చంద్రబాబు

చంద్రబాబు ప్రెస్ మీట్-ముఖ్యాంశాలు


(08.05.2020)
విశాఖపట్నం ఆర్ ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజి దుర్ఘటన  బాధాకరం :చంద్రబాబు


ఒకవైపు కరోనాతో రాష్ట్రం, ప్రపంచం భయభ్రాంతులు అవుతోన్న పరిస్థితుల్లో, జన జీవనం స్థంభించిన పరిస్థితిలో, విశాఖలో ఇలా జరగడం చాలా బాధేస్తోంది.  రాత్రంతా అసలు నేను నిద్ర పోలేక పోయాను.
తెల్లవారు జామున 3గంటలకు ఈ ప్రమాదంలో విష వాయువులు పీల్చి జనం ఎక్కడికక్కడే పడిపోవడం, 12మంది చనిపోవడం, 350మందిపైగా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల పాలు కావడం, అందులో 44మంది పిల్లలు ఉండటం, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లందరినీ ఆసుపత్రుల్లో చేర్చడం, అక్కడి విష వాయువులకు పాడి పశువులు విపరీతంగా  చనిపోవడం, 200పశువులు అస్వస్థత కావడం, చెట్లు రంగుమారడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. 
సమాచారం నాకు అందగానే హుటాహుటిన స్పందించాను. గణబాబు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ధైర్యంగా వెళ్లి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం అభినందనీయం.
ప్రధాని హైలెవల్ కమిటి మీటింగ్ పెట్టడం, హోం, డిఫెన్స్ మంత్రులతో సమీక్షించడం, హుటాహుటిన ఎన్ డిఆర్ ఎఫ్ ను మొహరింపజేసి సహాయ పునరావాస చర్యలు చేపట్టడం  చూశాం. 
జరిగింది తలచుకుంటే చాలా బాధేస్తోంది, మనసు కలిచివేస్తోంది. నిస్సహాయంగా చూడటం తప్ప మనం ఏమీ చేయలేక పోయామనే బాధ వేస్తోంది. 
సంఘటనా స్థలానికి వెళ్లడానికి అనేక విధాలా నేను ప్రయత్నించారు. కేంద్రమంత్రికి, కేబినెట్ సెక్రటరీకి,  అందరినీ అనుమతులు కోరాను. ఇప్పటిదాకా రాలేదు. దీనిపై రోజంతా సమీక్షలు చేశాను. కేంద్రానికి కూడా ఎప్పటికప్పుడు లేఖలు రాశాను. 
స్టెరైన్ ప్రమాదం గతంలో ప్రపంచంలో ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు.. ఇది జరిగితే ఎలా ఎదుర్కోవాలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు లేవు. పర్యావరణ పరంగా, ఆరోగ్యపరంగా వాటిల్లే దుష్ప్రభావంపై సమాచారం లేదు. ఇలాంటి సమయంలో దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సివుంది. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అంతా  ఇక్కడికి రావాలి, ఆయా రంగాల శాస్త్రవేత్తలు ఇక్కడికొచ్చి పరిశోధనలు చేయాలి. 
ప్రజల ఆరోగ్యంపై దీని దీర్ఘకాలిక దుష్ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. 
నిన్న కూడా నేను అనేకమంది మేధావులు, నిపుణులతో చర్చించాను, వారిచ్చిన సమాచారంపై చర్చించాను. 
గ్యాస్ లాగా ఉండే స్టైరీన్ లిక్విడ్ గా మారింది. ఈ ప్రమాదంలో అదే విడుదల అయ్యిందా లేక మరో రసాయనం కలిసి గ్యాస్ రూపంలో విడుదల అయ్యిందా అనేది అధ్యయనం చేయాలి. అలాంటప్పుడు దీనిని తేలిగ్గా తీసుకోవడం సబబు కాదు.
ఈ దుర్ఘటనపై సమగ్రంగా నిశితంగా, సైంటిఫిక్ గా దర్యాప్తు జరగాలి: 
సమగ్ర దర్యాప్తు విచారణలు లేకుండా ఏం జరిగిందని నిర్ధారించలేం. అక్కడి ఇతర పరిశ్రమల్లోని ఎయిర్ క్వాలిటి డివైస్ లలో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద ఎయిర్ క్వాలిటి డివైస్ లలో  ఏ సమాచారం నమోదు అయ్యిందో పరిశీలించాలి. ఇది మానవ తప్పిదమా, సాంకేతిక ప్రమాదమా, ఒకవేళ సాంకేతిక ప్రమాదం అయినా దానిని విజువలైజ్ చేయక పోయినా అది తప్పే. 
లాక్ డౌన్ లో దీనిని మూసివేసినా, మళ్లీ తెరిచేటప్పుడు ఇదేమీ నిత్యావసర వస్తువుల పరిశ్రమ ఏమీ కాదు. లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు తెరిచేటప్పుడు అన్నీ ముందే తనిఖీ చేసి ఆయా శాఖలన్నీ ఇవన్నీ పరిశీలించాకే దీనికి అనుమతులు ఇవ్వాల్సివుంది. ఒకప్పుడు ఇది పట్టణ శివారు అయినా ఇప్పుడు నగరానికి మధ్యలో ఉంది.
ఇదేరకమైన ప్రమాదాలు భోపాల్ తదితర చోట్ల జరిగాయి. అక్కడ కూడా సహాయ చర్యలు, ఆర్ధిక సాయం, పరిహారం పంపిణీ ఇలాంటివి చేశారు. ఆయా దుర్ఘటనల్లో ఏం చేశారు, ఎలా చేశారు అనేది చూడాలి. స్టైరీన్ ప్రమాదం ఎక్కడా జరగలేదు. అటువంటప్పుడు దీనిపై మరింత నిశితంగా సమగ్రంగా పరిశీలించాలి, విచారించాలి. దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ , సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా క్రియేట్ చేయాలి. 
ఇప్పుడు ఆసుపత్రులలో చికిత్స పొందే వాళ్లకు రేపు మళ్లీ సమస్యలు వస్తే ఏం చేయాలో ముందే అధ్యయనం చేయాలి. భవిష్యత్తులో దీనివల్ల ఎదురయ్యే దుష్పరిమాణాలను కూడా ఎదుర్కొనేలా సంసిద్దం కావాల్సివుంది. వాటన్నింటినుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేశంలో నిపుణులైన వైద్యులు,శాస్త్రవేత్తలు వీటన్నింటిపై సమగ్రంగా విచారించాలి. 
కానీ దీనిని హ్యాండిల్ చేసిన తీరు చూస్తే చాలా బాధేస్తోంది. 
ముఖ్యమంత్రి మాటల్లోనే, ఆయన ఏమన్నారంటే ‘‘ఎల్ జి పాలిమర్స్ మల్టీ నేషనల్ కంపెనీ. మృతుల కుటుంబాలకు రూ కోటి పరిహారం అందించేలా చూస్తా. ఎల్ జి సంస్థ ఏ మేరకు పరిహారం ఇస్తుందో చూస్తాం. ఆ పై సాయం ప్రభుత్వం నుంచే అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్ జి కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నా. సంస్థను తిరిగి ప్రారంభించాక అక్కడే ఉన్నా,వేరే చోటకు తరలించినా బాధిత కుటుంబాలకు ఉపాధి చూపిస్తామని’’ చాలా క్యాజువల్ గా మాట్లాడారు.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి   చాలా క్యాజువల్ గా మాట్లాడారు. ఇది క్యాజువల్ గా తీసుకోవాల్సిన అంశం కాదు. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని మహాత్మాగాంధీ చెప్పారు.
ఇందులో కూడా బాధితులను దృష్టిలోపెట్టుకుని మాట్లాడాలే తప్ప పరిశ్రమ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడరాదు.
దీనిని ముఖ్యమంత్రి తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు: 
హైకోర్టు సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేసింది. మానవ హక్కుల కమిషన్ సుమోటాగా దీనిని చేపట్టింది. 
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ 50కోట్ల స్థానిక కోర్టులో ఎల్జీ పాలిమర్స్  డిపాజిట్ చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రధానమంత్రి హైలెవల్ కమిటి పెట్టి దీనిపై సమీక్షించారు. కేబినెట్ సెక్రటరీ దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
గ్యాస్ అడ్డుకోడానికి కావాల్సిన మెటీరియల్ ఇక్కడ లేదంటే, గుజరాత్ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు పంపేలా చేశారు. 
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అక్కడికొచ్చి, దీనిపై దర్యాప్తు అంతా అదేదో తూతూమంత్రంగా మా అధికారుల కమిటి విచారిస్తుందని చెప్పడం సరి కాదు. ఇది సబ్జెక్ట్ తెలిసిన నిపుణులు చేయాలి. వాళ్లు ఆపరేషనల్ ప్రొసీజర్ కరెక్ట్ గా ఫాలో అయ్యారా లేదా..? తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా...? అనే కోణాల్లో దీనిపై విచారణ చేయాలి. 
     తేలిగ్గా ఏదేదో చెప్పేసి 278, 284,285,337,338(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తే చాలదు. సింపుల్ కేసులు పెట్టి నార్మల్ గా  ఈ కేసును పరిగణించడం కరెక్ట్ కాదు.
ఎల్జీ పాలిమర్స్ ప్రకటన కూడా చాలా తేలిగ్గా ఉంది. వాళ్లు ఏమన్నారంటే, ‘‘ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అన్వేషిస్తున్నాం. మా సాంకేతిక బృందాలకు ఆ పని అప్పగించాం. స్థానికంగా ఉన్న దర్యాప్తు అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ సంస్థగా అత్యున్నత పర్యావరణ పరిరక్షణ, భద్రతా ప్రమాణాలకు తాము కట్టుబడి ఉన్నామని’’ ప్రకటనలో చెప్పారు.
నిన్న జరిగిన దుర్ఘటనలో వేలాది ప్రజలు ఊళ్లు వదిలి పెట్టి ఖాళీ చేశారు. లక్షలాది ప్రజలు భయభ్రాంతులు అయ్యారు. 
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉండేవ్యక్తికి అధికారం ఉంది. కేంద్రంతో మాట్లాడవచ్చు. నిపుణులతో మాట్లాడి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అవన్నీ చేపట్టవచ్చు. 
తప్పు చేసినవాళ్లు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరైనా శిక్షకు అర్హులు:
ఇక్కడ ముఖమాటానికి అవసరం లేదు. తప్పు చేసినవాళ్లు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరైనా శిక్షకు అర్హులు. 
ఇది మూమూలుగా పరిశ్రమల్లో జరిగే ప్రమాదం వంటిది కాదు.ఇదేదో పరిశ్రమల్లో ఉద్యోగులు చనిపోయిన దుర్ఘటన కాదు. దీని కారణంగా బైట జనం చనిపోయిన దుర్ఘటన. నిన్న సాయంత్రం కూడా గుజరాత్ నుంచి మెటీరియల్ తెప్పించాక, ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఎవరూ ఉండవద్దని ప్రచారం చేశారు. దానితో విశాఖ అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. నేరుగా బీచ్ రోడ్డుకు పరుగులు తీశారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే. ఇలాంటప్పుడు ప్రజలు భీతి చెందకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సివుంది. అది చెప్పకుండా ఇలాంటివి చేయడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయి. 
500మీటర్ల కన్నా ఎక్కువ దూరం ఈ గ్యాస్ పోదని కొంతమంది అంటున్నారు. 40రోజుల లాక్ డౌన్ వల్ల ఇది జరిగిందా, లేక ఏదైనా రసాయనం కలిసి గ్యాస్ విడుదల కావడం వల్ల జరిగిందా అనేవన్నీ సీరియస్ గా తీసుకుని విచారించాల్సివుంది. 
లాక్ డౌన్ లిఫ్ట్ చేసినప్పుడు అనుకున్న ప్రొటోకాల్ అయినా పాటించారా మీరు..? అక్కడ సైరన్ కూడా మోగలేదు, మోగితే మేము వెళ్లిపోయేవాళ్లం అని జనం అంటున్నారు. నిద్రపోతూ అక్కడే చనిపోయారు. కొంతమంది ఎక్కడివాళ్లక్కడే కుప్పకూలారు. పరుగెత్తి బావిలో పడి చనిపోయారు.
బాధితులను ఆదుకున్న వారందరికీ అభినందనలు: 
బాధితులను కాపాడిన ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ ఇతర సిబ్బందిని అభినందిస్తున్నాను. 
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పనిచేయాలే తప్ప  తేలిగ్గా తీసుకోరాదు. దీని పరిణామాలు ఎలా ఉంటాయో అధ్యయనం చేయాలి. ఏయే చర్యలు తీసుకోవాలో వాటన్నింటినీ తీసుకోవాలి.
జరిగిన దుర్ఘటన దుష్ఫ్రభావం విశాఖ ప్రజలపై ఎంత మేర పడింది..ఎయిర్ క్వాలిటి ఎంతమేర దుష్ప్రభావానికి లోనైంది. అక్కడ నివసించే ప్రజల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలి. దాని ప్రకారం వాళ్లకు చికిత్స అందించాలి. ప్రపంచ స్థాయిలో నిపుణులైన అన్నిరకాల డాక్టర్లను భాగస్వాములను చేయాలి. 
ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. ఆ విషయం అందరూ గుర్తుంచు కోవాలి. 
బెస్ట్ సిటిలలో ఒక్కటైన విశాఖలో ఇటువంటి పరిస్థితి ఊహించలేదు. నిన్న రాత్రి కూడా నిద్ర రాలేదు. మనం పోలేక పోతున్నామనే నిస్సహాయత, లాక్ డౌన్ వల్ల అక్కడికి పోలేక పోతున్నామనే బాధ కలిచివేస్తోంది. 
టిడిపి తరఫున విశాఖకు త్రిసభ్య బృందం: 
అందుకే టిడిపి తరఫున అచ్చెన్నాయుడు, చినరాజప్ప, రామానాయుడు త్రిసభ్య బృందాన్ని పంపిస్తున్నాం.అక్కడి ప్రజానీకానికి భరోసా ఇవ్వడానికి, వారిని అన్నివిధాలా ఆదుకోడానికి, అండగా ఉండటానికి పంపిస్తున్నాం. 
ఫాక్టరీ తరలింపుపై కావాలంటే ఆలోచిస్తాం, పరిహారంపై ఫాక్టరీపై చర్చిస్తాం అని తేలిగ్గా తీసుకోరాదు. ఆ ఫ్యాక్టరీని ముందుగా క్లోజ్ చేయాలి. 
అక్కడ నుంచి ఫాక్టరీని వెంటనే తరలించాలి. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సురక్షిత ప్రాంతానికి ఈ ఫ్యాక్టరీని తరలించాలి. ప్రజల ప్రాణాలు ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యం.
జరిగిన దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవడం, నిపుణులతో మాట్లాడటం చేస్తూనే ఉన్నాను. 
బ్లడ్ వచ్చింది ట్రీట్ చేయించాం, చేయి విరిగింది చికిత్స చేయించాం అనే ధోరణి కరెక్ట్ కాదు. అందరినీ కాపాడాల్సిన బాధ్యత, నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 
టిడిపి తరఫున మేము అదే డిమాండ్ చేస్తున్నాము.  దీర్ఘకాలంలో అందరి ఆరోగ్యాలను కాపాడాలి. మృతుల కుటుంబాలకు, బాధితులకు న్యాయం  చేయాలి.
 ఈ పరిస్థితుల్లో మీరంతా ధైర్యంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను. నేను కూడా ప్రధానమంత్రికి లేఖ రాస్తాను. ప్రజలకు అన్నిరకాల ఉపశమనం కలిగేదాకా అన్ని చర్యలు చేపట్టాలి.
     ప్రాణాలకు తెగించి బాధితులను ఆదుకోడానికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎంతో ధైర్యంగా మా ఎమ్మెల్యే గణబాబు తదితరులు తెల్లావారుజామునే వెళ్లి బాధితులకు అండగా నిలబడ్డారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ముఖ్యమంత్రి అవగాహనా లోపం-బాధ్యతా రాహిత్యం: 
ముఖ్యమంత్రిలో అవగాహన లోపం కనిపిస్తోంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సీఎం స్థాయిలో పదిమందితో మాట్లాడాలి. అవసరమైతే ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లాలి. నేనైతే వెంటనే అక్కడికి వెళ్లేవాడిని. ఏదో కలెక్టర్ తో మాట్లాడి ప్రకటన చేస్తే చాలదు. అక్కడే అవగాహనా రాహిత్యం కనిపిస్తోంది. ఎన్ జిటి రూ 50కోట్లు ఎందుకు డిపాజిట్ చేయమంది. హైకోర్టు ఎన్ హెచ్ ఆర్సీ ఎందుకు సుమోటాగా తీసుకున్నాయి. అందులో తీవ్రత అర్ధం చేసుకోవాలి. అంతా నాకే తెలుసు అనేది సబబు కాదు. అక్కడే ఆయనలో లోపం కనిపిస్తోంది
ప్రజల జీవితాలకు భరోసా ఉంటామని ఒక మాండేట్ తీసుకున్నాక, ఇలా చేయడం సరైందికాదు.
అంతకు ముందు కూడా కరోనాపై ఇలాగే ‘‘అదేదో చిన్న జ్వరం, పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని, బ్లీచింగ్ జల్లాలని’’ అని తేలిగ్గా మాట్లాడారు. ఇప్పుడు ఇంత తీవ్ర ప్రమాదాన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. 
దీని దుష్ప్రభావం సుదీర్ఘకాలంలో తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు, మీడియాలో కథనాలు వస్తున్నాయి,వీటన్నింటిని పరిశీలనలోకి తీసుకోవాలి.
వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మార్గదర్శకం చేయాలి. ఆర్టీజిఎస్ ఉంటే ఇలాంటప్పుడు ఎంతో ఉపయోగపడేది. అక్కడి ప్రజలను సకాలంలో అప్రమత్తం చేసేది. 
రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటిలో కెమికల్ ఇంజనీర్లు, సైంటిఫిక్ నిపుణులు లేరు. అధికారులతో కమిటి వల్ల కొత్తగా వెల్లడయ్యేదేమీ ఉండదు. 
హుద్ హుద్ విపత్తులో నేను 9రోజులు అక్కడే ఎందుకున్నాను..? మూడు మజిలీలు దాటి పట్టుబట్టి అక్కడికి వెళ్లాను. విశాఖలో 9రోజులు మకాం పెట్టి ప్రజల్లో ధైర్యం నింపాం, భరోసా ఇచ్చాం, సహాయ పునరావాస చర్యలు పర్యవేక్షించాం. అది మన బాధ్యత. 
ఇప్పుడీ ముఖ్యమంత్రి నిన్న విశాఖ వెళ్లి మళ్లీ కొన్ని గంటల్లోనే ఎందుకని వెనక్కి వెళ్లిపోయారు..? అక్కడే ఉండి పరిస్థితులను ఎందుకని చక్కదిద్ద లేక పోయారు..? దీనిని అందరూ ఆలోచించాలి.  
ప్రతి పరిశ్రమ భద్రతా చర్యలు చేపట్టాలి. గతంలో ప్రమాదాలు జరిగితే ఆ ఫ్యాక్టరీకే పరిమితం అయ్యేవి. అయితే ఈ ప్రమాదం ఫ్యాక్టరీకి పరిమితం కాలేదు. అనేక ఊళ్లపై, బైట జనంపై తీవ్ర ప్రభావం చూపింది.
 గ్యాస్ లీకేజి టిడిపి చేసిందనే దుష్ప్రచారం చేయడం హేయం: 
తామేం చెప్పినా ప్రజలు నమ్ముతారనే దురాలోచనలో వైసిపి నేతలు ఉన్నారు. గ్యాస్ లీకేజి తెలుగుదేశం పార్టీయే చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. సభ్యత లేకుండా ఏది పడితే అది అంటున్నారు. ఇది సరైంది కాదు. 
రాజధాని విశాఖకు మార్చడం ఇష్టంలేకే టిడిపి ఈ ప్రమాదానికి పాల్పడిందని విమర్శించడం దారుణం.
మద్యం షాపుల దగ్గరకు జనాన్ని టిడిపినే తరలించిందని కూడా వైసిపి నాయకులు విమర్శలు చేశారు. ప్రజా వేదిక విధ్వంసం నుంచి ప్రతి దానిలో ఇలాగే చేస్తున్నారు. పోలీసులు ఉన్నారు కదా అని ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. 
మీ పరిపాలన గురించి, మీరు చేసే తప్పుడు పనుల గురించి మీ కార్యకర్తలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి. 
ప్రజల సహనానికి కూడా హద్దులు ఉంటాయి: 
ప్రజలు నిస్సహాయులు అనుకుంటున్నారా..? ప్రజల సహనానికి కూడా హద్దులు ఉంటాయి. ఎన్నివిధాలుగా వేధిస్తున్నారు ప్రజలను, ప్రతిపక్షాలను..? ఇప్పుడు మళ్లీ సాయంత్రానికల్లా నాపై విమర్శలు చేస్తారు. 
ఎదురుదాడి చేయడం మానేయండి ఇప్పటికైనా.. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మానుకోండి. వాస్తవాలు ఉంటే స్వీకరించండి, అవాస్తవాలు ఉంటే మానేయండి. 
తప్పును తప్పని చెప్పడానికి వీల్లేదా..? వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించే ధైర్యం ఉండాలి. అందరం కలిసి సమష్టిగా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాలి. ప్రజలను భయపెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కావాల్సింది ప్రజలకు భరోసా.
విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనపై ప్రధానికి లేఖ రాస్తాను. విశాఖలో ఎయిర్ క్వాలిటి పరీక్షించాలి. ఎంత గాఢత ఉంది..? ఎంత విస్తీర్ణంలో వ్యాపించింది అధ్యయనం చేయాలి. 
స్టైరైన్ దుష్ప్రభావంపై సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు కాబట్టి తక్షణం వెంటనే ఏం చేయాలి, బాధితులకు దీర్ఘకాలంలో ఏం చేయాలి, తక్షణమే ఎలా ఆదుకోవాలి అనేదానిపై ఆ లేఖలో పేర్కొంటాం. 
ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు రూపొందించాలి: 
అక్కడి ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు రూపొందించాలి. భవిష్యత్తులో ఏమీ జరగకపోతే బాధ లేదు. ఏదైనా జరిగితే మాత్రం దానికి కూడా వీళ్లే బాధ్యత తీసుకోవాలి. ఏదైనా సమస్య భవిష్యత్తులో వస్తుందని తేలితే ఇప్పటినుంచే వాటికి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.
ఈ దుర్ఘటనపై నిజ నిర్దారణ జరగాలి. సుందర నగరం విశాఖను కాపాడుకోవాలి. 
ప్రజల జీవితాలను దీర్ఘకాలంలో ప్రభావితం చేసే ప్రమాదం ఇది. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో కూడా అధ్యయనం చేయాలి. సైంటిస్ట్ లు చెప్పే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసిన నిపుణులను, ఇలాంటి వ్యాధులకు చికిత్స చేసిన వైద్యులు, ఇతర నిపుణులతో చర్చించాలని’’ చంద్రబాబు పేర్కొన్నారు. 
                                          


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
ఇదీ వాటర్‌ గ్రిడ్‌
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.