మత్స్య కారులకు అండగా ఉంటాం : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 
—————————————————.      మత్స్య కారులకు అండగా ఉంటాం 
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
- ఈ నేపథ్యంలో రూ.16 
 లక్షల ఖర్చుతో 
ఐదు కేజీల బియ్యంబస్తాలు 8 వేల మందికి పంపిణీ
-అలాగే కుటుంబానికి 4 గుడ్లు కూడా ...
-హర్షాన్ని వ్యక్తం చేస్తున్న మత్స్య కారులు 
-త్వరలో దక్షిణంలో మరో ఎనిమిదివేలమందికి పంపిణీ 
లాక్ డౌన్ సమయంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇప్పటికే తన పార్లమెంట్ పరిధిలో ఆరిలోవ తదితర ప్రాంతాలలో రూ.15 
లక్షల ఖర్చుతో ఐదుకేజీల చొప్పున 16  వేలమందికి కూరగాయలు పంపిణీ  చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పేదలకు బాసటగా నిలిచినా ఎంవీవీ, తాజాగా మత్స్యకారులకు బాసటగా నిలిచారు.తూర్పు నియోజకవర్గ పరిధి 19  వ వార్డులో ఉన్న  ఎనిమిది వేల నిరుపేద మత్స్య కార కుటుంబాలకు తోడుగా నిలిచారు.వారి ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితిని గమనించి రూ.16 
లక్షల రూపాయల సొంత నిధులతో ఐదు కేజీల నాణ్యమైన బియ్యంబస్తా తో  పాటు,పౌష్టికాహార౦ గా కుటుంబానికి నాలుగు కోడిగుడ్లను లా సన్స్ బే కాలనీ పార్టీ ఆఫీస్ లో ఆయనచేతుల మీదుగా స్వయంగా అందజేశారు.  ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ గౌ.ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి గారి పర్యవేక్షణలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సఫలీకృతులం అవుతున్నామన్నారు.ఆయన చూపిన మార్గంలో వెళుతూ ప్రతిపేదవాడి క్షుద్భోద తీర్చేందుకు నిరంతరం గా తమవంతు కృషిచేస్తున్నామన్నారు.మరో మూడు,నాలుగు  రోజుల్లో దక్షిణ నియోజక వర్గంలో ,ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో ఎనిమిదివేలమంది కి బియ్యం తదితర సరుకులు పంపిణీకార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
ఈ సందర్భంగా మత్స్య కారులు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image