వైసీపీ లో చేరిన కాపు నాయకుడు ఊసా వెంకటరావు

వైసీపీ లో చేరిన కాపు నాయకుడు ఊసా వెంకటరావు ...


కావలి ,మే 12(అంతిమ తీర్పు - N. సాయి )
కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి నాయకత్వానికి అమలుచేస్తున్న సంక్షేమ  పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో వున్న  34 వ వార్డుకు చెందిన కాపు నాయకుడు  ఊసా వెంకటరావు ఎమ్మెల్యే చేతులమీదుగా  
 ఊసా వెంకటరావు,  ఆయన అనుచరులు పార్టీ కండువాలు కప్పించుకొన్నారు . వైస్సార్సీపీ తీర్ధం తీసుకొన్న ఊసా మాట్లాడుతూ తాను 20 సంవత్సరాలుగా తెలుగుదేశంలో వున్నానని , జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పధకం , కాపులకు అందిస్తున్న సంక్షేమ  పథకాలు నన్ను వైస్సార్సీపీ కి దగ్గర చేశాయన్నారు . ప్రతాపకుమార్ రెడ్డి 2024 లో కూడా ఎమ్మెల్యే అయి హ్యాట్రిక్ సాధించాలని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు . ఎమ్మెల్యే , ఏఎంసీ చైర్మన్ ల మంచితనం , నిబద్ధత నచ్చి తాను వైస్సార్సీపీలోకి వచ్చానన్నారు .
 ఈ చేరికల్ని ఉద్దేశించి  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి మాట్లాడుతూ - లాక్ డౌన్ కారణంగా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితులు వున్నందున ఇంకా చాలామందిని చేర్చుకోలేకపోయామన్నారు . లాక్ డౌన్ అనంతరం పట్టణంలో ఇంకా చాలా మంది  పార్టీలో చేరే అవకాశాలున్నాయన్నారు . ముఖ్యమంత్రి నెరవేరుస్తున్న హామీలకు , సంక్షేమ పథకాల అమలుకు అందరూ ఆకర్షితులవుతున్నారన్నారు . వూసా 34 వ వార్డుకే పరిమితి కాకుండా పట్టణంలోని కాపునాయకుల్ని సమన్వయపరుస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు . కరోనా సమయంలో కష్టపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు , వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు . ఊసా చేరికతో 34 వ వార్డు వైస్సార్సీపీ కి కంచుకోటగా నిలిచిందని , ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ వార్డు వైస్సార్సీపీ ఖాతాలో పడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు . 
ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ - రాబోయే 2024 ఎన్నికల్లో తిరిగి రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి విజయంసాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమన్నారు .  2024 ఎన్నికల్లో ప్రతాపకుమార్ రెడ్డి పై పోటీచేయాలంటే ఎవరయినా భయపడే విధంగా పార్టీని బలోపేతంచేస్తూ ముందుకు తీసుకెళతామన్నారు . జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు ఊసా వెంకటరావు లాంటి ఎంతోమంది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పథకాలకు ఆకర్షితులై వైస్సార్సీపీ లో చేరుతున్నారన్నారు .
కార్యక్రమంలో పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి , మాజీ మండలాధ్యక్షుడు నాయుడు రాం ప్రసాద్ , మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకట నారాయణ తదితర వైస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు , నాయకులు పాల్గొన్నారు