ప్రభాకరాచారి వైసిపికి చేసిన సేవలు మరువలేనివి, --వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి వెల్లడి

ప్రభాకరాచారి వైసిపికి చేసిన సేవలు మరువలేనివి,
--వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి వెల్లడి


మంత్రాలయం,మే,16 (అంతిమతీర్పు):-మంత్రాలయం నియోజకవర్గంలోని 


విశ్వబ్రాహ్మనఅయినా  ప్రభాకరాచారి వైసిపికి చేసిన సేవలు మరువలేనివి అని వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి అన్నారు. శనివారం ప్రభాకరాచారి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆదేశాల మేరకు రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు సంతాప సభనిర్వహించామన్నారు.ప్రభాకరాచారి మంత్రాలయం గ్రామానికి మాజీ సర్పంచ్ గా శ్రీ మఠం షాపింగ్ కాంప్లెక్స్ యూనియన్ అధ్యక్షులుగా సేవలు అందించారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బి.వి. మోహన్ రెడ్డి కాలంలో ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి అని తెలిపారు. రాంపురం రెడ్డి సోదరుల నేతృత్వంలో వైసిపి పార్టీ బలోపేతానికి కృషి చేశారని ఇటీవల అనారోగ్యంతో మరణించడం పార్టీకి తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొంత సేపు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టి. భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ నాయకులు జనార్దన్ రెడ్డి,వీరారెడ్డి, యం.ఆర్విరెడ్డి ,మల్లికార్జున, హోటల్ పరమేష్ స్వామి,జగదీష్ స్వామి, శివకుమార్,ఆకారం ప్రహ్లాద, బద్రీనాథ్ శెట్టి, దామోదర గుప్త, దర్జీ ప్రకాష్,యస్. శ్రీనివాసులు,బసవరాజు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image