వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ, బెంగాల్ వెళ్లేందుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేత.సుంకర పద్మ శ్రీ.

ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మ శ్రీ.


వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ, బెంగాల్ వెళ్లేందుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేత.


కృష్ణా జిల్లా , గన్నవరం మండలం , వీరపనేనిగూడెం లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఒక ప్రైవేటు  కంపెనీలో పనులు చెస్తున్న 20 మంది యువత కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల తినటానికి తిండి లేక , వారి రాష్ట్రానికి తిరిగి వెళ్ళటానికి ఇబ్భoదులు పడుతున్న విషయం తెలుసుకుని తక్షణమే వారిని వారి స్వస్థలాలకు పంపించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ని పంపించేందుకు అయ్యే రవాణా ఖర్చులు తాను భరిస్తా అని స్పష్టం చేశారు. 


మద్యం అమ్మకాలు రెడ్ జోన్, ఆరంజ్ జోన్ లలో కూడా జరుపుతున్న నేపథ్యంలో వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించటానికి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ జోన్, ఆరంజ్ జోన్ అని సాకులు చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక VRO దృష్టికి తీసుకెళ్లి 10 రోజులు అయినా స్పందించలేదన్నారు. ఇప్పటి వరకు వారిని ఎవరు పట్టించుకోక పోవడం దారుణం అని దుయ్యబట్టారు.  కలెక్టర్, జేసి, mro తో సహా ఎవ్వరు ఫొన్ లు ఎత్తి సమధానం చెప్పే పరిస్తితిలో లేరన్న పద్మశ్రీ... పేదలకు దిక్కు ఎవరని నిలదీశారు.


పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు, మీడియా తమ ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే.. ఈ రాష్ట్ర  ముఖ్యమంత్రి బయటకు రాకుండా,
ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో  ప్రణాళిక రచిస్తున్నాడని విమర్శించారు.


ఆదాయం పెంచుకునే ఆలోచన తప్ప... లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల బాధలు చెవికి ఎక్కించుకుని స్థితిలో సీఎం లేడన్నారు. నేను ఉన్నాను... నేను విన్నాను అని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకున్నాను... దాచుకున్నాను అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా కనపడని, వినపడని బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


40 రోజుల లాక్డౌన్ ఫలితాన్ని ఒక్క పూటతో జగన్మోహన్ రెడ్డి.. నీరుగార్చారని.. వెంటనే మద్యం అమ్మకాలు నిలిపివేసి.. ప్రజల ప్రాణాలు కాపాడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు