మద్యం అక్రమాలపై పాశుపతాస్త్రం -స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో' - మద్యం,ఇసుక అక్రమాలకు ఇక తావులేదు: వల్లంరెడ్డి లక్ష్మరెడ్డి వెల్లడి

09.05.2020
                       గుంటూరు
                 ---------------------


మద్యం అక్రమాలపై పాశుపతాస్త్రం ..
         'స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో'
- మద్యం,ఇసుక అక్రమాలకు ఇక తావులేదు             - మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ 
   వల్లంరెడ్డి లక్ష్మరెడ్డి వెల్లడి
----------------------------------------------------------
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి స్పెషల్ ఎన్ ఫోర్సమెంట్ ఏర్పాటు నిర్ణయం శుభపరిణామమని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రకటనలో వెల్లండించారు. రాష్ట్రంలో దశలవారీ మద్యనిషేధం అమలు చర్యల్లో భాగంగా ఈ ఎన్ ఫోర్స్మెంట్ విభాగంతో ప్రభుత్వం మరో ముందడు వేసిందని తెలిపారు. నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి సాగు, తరలింపు, రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణా, ఇసుక అనధికార తరలింపును అడ్డగించడంలో బలమైన స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సర్వత్రా ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్య నియంత్రణ, ఎన్ ఫోర్స్ మెంట్ లాంటి అంశాల్ని పూర్తిగా వదిలేసి దోపిడీకి తలుపులు తెరిచిన సంగతిని లక్ష్మణరెడ్డి గుర్తుచేశారు. మద్య విమోచన కమిటీతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించడం కాకుండా  ధరలను పెంచడం అందరికీ తెలిసిందేనన్నారు. గ్రామాల్లో వేలాది బెల్టుషాపులను ఏరిపారేయడమే కాకుండా 4500 పర్మిట్ రూంలను ఎత్తివేయడంతో పాటు తాజాగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటుతో దశలవారీ మద్యనిషేధానికి మార్గం సుగమమైనదని తెలిపారు. మద్యం, ఇసుక అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే నిర్ణయాలు భవిష్యత్తులో మరిన్ని ఉంటాయని లక్ష్మణరెడ్డి తెలియజేశారు.


             - వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
                     చైర్మన్
      మద్య విమోచన ప్రచార కమిటీ
            ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం