విపత్కర పరిస్థితుల్లో చేతనైనంత సేవ చేయడం మా బాధ్యత: వైసీపీ నాయకులు..  

విపత్కర పరిస్థితుల్లో చేతనైనంత సేవ చేయడం మా బాధ్యత: వైసీపీ నాయకులు..


గూడూరు: గౌరవ శాసనసభ్యులు డా. వెలగపల్లి వరప్రసాద్ రావు గారు, వై సి పి రాష్ట్ర నాయకులు శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలతో,  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 29 వ తేదీ నుండి నేటి వరకు 36 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత సమయానికి 350 మందికి (పారిశుధ్య సిబ్బందికి మరియు బయట ఊర్లనుండి విధినిర్వహణలో పాల్గొంటున్న కొంతమంది ప్రభుత్వ సిబ్బందికి ) టిఫిన్ అందచేయటం జరిగింది అని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు అన్నారు. ఈ సందర్భంగా నాగులు మాట్లాడుతూ  పెద్దలు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు,నేను మరియు మిత్రులు మాజీ కౌన్సిలర్లు బొమిడి శ్రీనివాసులు, చోళవరం గిరిబాబుల సంపూర్ణ సహాయ సహకారాలు, గౌరవ కమీషనరు గారు, గౌరవ పోలీస్ అధికారుల సూచనల ప్రకారం, సచివాలయ సిబ్బంది ద్వారా  ఈ కార్యక్రమాన్ని నేటి వరకు నిర్విఘ్నంగా కొనసాగించి నేటితో ముగిస్తున్నాము అని ఈ సందర్భంగా గూడూరు మునిసిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు గారి చేతుల మీదుగా 310 మందికి అల్పాహారం ప్యాకెట్ లను మునిసిపల్ మరియు పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయడం జరిగింది.లాక్ డౌన్ సమయంలో మా ఈ చిన్న కార్యక్రమానికి అనుమతించి, మమ్మల్ని కూడా భాగస్వాములను చేసిన గౌరవ మున్సిపల్ కమీషనరు గారికి, పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు,  సచివాలయ సానిటరీ సిబ్బందికి,  వాలంటీర్లందరికీ, సహకరించిన మా మిత్రులు, కుటుంభ సభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఓబులేశు, పట్టణ సీఐ దశరథ రామారావు, వైసీపీ నాయకులు అన్నం మురళి,మైనారిటీ నాయకులు సందాని బాషా తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image