ర్యాంపులకు 5 కి.మీ లోపు ఉచితంగా ఇసుక విజయవాడ : ర్యాంపులకు 5 కి.మీ లోపు గ్రామాల ప్రజల అవసరాలకు ఎద్దుల బండిపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ఇసుక రవాణాపై మైనింగ్‌ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. నదీ పరివాహక ప్రాం తంలోని గుర్తించిన 118 గ్రామాలకు ఈ అవకాశం ఉందన్నారు. ఇసుక నిల్వ చేసినా, అమ్మినా జరిమానా విధిస్తామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతీరోజూ మూడు వేల కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. కొవిడ్‌-19 ఆసుపత్రులు, వైద్య పరీక్షల నిర్వహణపై వైద్యాధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పాజిటివ్‌ కేసుల అడ్మిషన్‌, డిశ్చార్జ్‌ వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా పంపాలన్నారు. జేసీలు శివశంకర్‌, మోహన్‌కుమార్‌, డీఆర్వో ప్రసాద్‌ పాల్గొన్నారు. గ్రామ సచివాలయల నిర్మాణాల్లో వేగం పెంచాలని పంచాయతీ రాజ్‌శాఖ ఇంజనీర్లను కలెక్టర్‌ ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలతో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయితీరాజ్‌ శాఖకు అప్పగించిన 811 గ్రామ పంచాయతీల నిర్మాణ పనులను ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 801 రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కూడా ఈ నెలాఖరుకు ప్రారంభించాలన్నారు. జేసీ మోహన్‌కుమార్‌, జడ్పీ సీఈ వో సూర్యప్రకాష్‌, సర్వశిక్షాభియాన్‌ ఏసీపీ రవీంద్రబాబు పాల్గొన్నారు.


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image