. జర్నలిస్టులకు 50 లక్షల కరోనా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి సమాచార కమిషనర్ కు ఏ.పీ. జే .ఎఫ్ .నేతల విజ్ఞప్తి విజయవాడ జూన్ 22: రాష్ట్రంలోని విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఉదయం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణంలోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయంలో విజయ్ కుమార్ రెడ్డిని ఏ.పీ. జే. ఎఫ్. రాష్ట్ర నాయకులు కలిశారు. ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కోవిడ్ 19 వైరస్ ప్రభావానికి గురైన విలేకరులకు రూ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు లాగానే విలేకరులు కూడా నిరంతరం వార్తా సేకరణలో భాగంగా కష్టాలు పడుతున్నారన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనల వల్ల కరోనా మహమ్మారి బారిన పడి మీడియా ప్రతినిధి మృతి చెందితే విలేఖర్లకు రూ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం వర్తించేలా గా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని నాయకులు విజయ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంతో కాలంగా విలేకరులుఎదురు చూస్తున్న అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన ఇవ్వాలని ఆయన ను కోరారు. అయితే అక్కడ అక్రిడేషన్ ప్రక్రియ జరుగుతుందని, జూలై నెల ఆరంభంలోకొత్త కార్డులు ఇచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే విలేకరుల హెల్త్ కార్డ్ విషయంలో కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరగా కొత్త అక్రిడేషన్ వచ్చే వరకు పాత కార్డులు పనిచేసే విధంగా ఆరోగ్య శ్రీ అధికారుల దృష్టికి తీసుకెళ్లమని, కార్డ్ ఉన్న జర్నలిస్టు లకు ఏమైనా ఇబ్బంది వస్తే తమ కార్యాలయంలోని ఏ.డి.గారిని కలిస్తే హెల్త్ కార్డ్ ఆ సమస్య పరిష్కారిస్తారన్నారు. ప్రమాద బీమా పునరుద్ధరించాలని కోరగా, అది ప్రభుత్వం వద్ద ఉందన్నారు. జర్నలిస్ట్ లు ఈ కరోన సమయంలో మరింత ఇబ్బంది పడకుండా అక్రిడేషన్ తదితర సమస్యలు పరిష్కాoరిచాలని నేతలు కోరారు. ఏపీజే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాoజనేయులు నేతృత్వంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి వీర్ల శ్రీరామ్ యాదవ్, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకటరమణ , నగర కోశాధికారి అనిల్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలను తెలియజేశారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని,వర్కింగ్ జర్నలిస్ట్ లకు ప్రభుత్వం న్యాయం చేస్తుoదని,వారు సానుకూలంగా స్పందించినందుకు కమీషనర్ కు ఏపీ జే ఎఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం