ఏపిపిటిడిఏఈఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ప్లానింగ్ అడ్వైజ‌ర్‌గా శంక‌ర్‌ విజ‌య‌వాడ‌‌: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపిపిటిడిఏఈఏ) రాష్ట్ర కమిటీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్లానింగ్ అడ్వైజర్‌గా కొంకిమ‌ళ్ల శంక‌ర్‌ను నియమించిన‌ట్లు అసోసియేష‌న్ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ మేర‌కు నియామకపు పత్రాన్నివిజ‌య‌వాడ ఆర్టీసీ హౌస్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో ఉంటున్న ఏపి ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ క‌మిష‌న‌ర్ టి.కృష్ణ‌బాబుకు పంపించారు. సుమారు గ‌డ‌చిన రెండు ద‌శాబ్ధాలుగా శంక‌ర్ జర్నలిజంలో అపారమైన అనుభవంతో పాటు సామాజిక బాధ్య‌త‌గా త‌నవంతుగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ సేవలందిస్తున్నార‌ని జ‌‌క్కా సాయిబాబు పేర్కొన్నారు. ఈ నేప‌ధ్యంలో శంక‌ర్ అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు బాసటగా నిలిచేందుకు ముందుకు రావడం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఏపిపిటిడిఏఈఏ రాష్ట్ర ప్ర‌చార కార్య‌ద‌ర్శి పి.సుబ్ర‌హ్మ‌ణ్యం మాట్లాడుతూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పట్ల పూర్తి అవగాహన ఉన్న శంక‌ర్‌ను రాష్ట్ర కమిటీ త‌ర‌ఫున అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.