అంబేద్కర్‌ సేవలు నిరుపమానం: బిశ్వభూషణ్

అంబేద్కర్‌ సేవలు నిరుపమానం: బిశ్వభూషణ్
విజయవాడ : భారత రాజ్యాంగ పితామహుడుగా అంబేద్కర్‌ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. రేపు(మంగళవారం) అంబేద్కర్‌ జయంతి సందర్భంగా గవర్నర్‌ సందేశమిచ్చారు. మహిళలు, బలహీన వర్గాలకు సమాన హక్కులను కల్పించే దిశగా ఆధునిక భారతదేశం కోసం జీవితకాల పోరాటం చేశారని ప్రస్తుతించారు. కులం లేని నవ సమాజ నిర్మాణానికి అంబేద్కర్‌ పునాదులు వేశారని కొనియాడారు. తన జీవితాన్ని పేదలు, అణగారిన, దిగువ కులాలకు చెందిన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేసిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్‌ అని కీర్తించారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి, దళితులపై సామాజిక వివక్షను అరికట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారని గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్ కొనియాడారు.